Tuesday, December 24, 2024
HomeMovie Newsఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన ప్రశాంత్ నీల్

- Advertisement -

KGF , సలార్ సూపర్ హిట్స్ తో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం సలార్ 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఎన్టీఆర్‌ 31 (NTR 31)గా రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే మేక‌ర్స్ పోస్టర్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా..ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్​డేట్‌లు వస్తాయా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గత కొద్దీ రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మూవీకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్ మే 20 రానున్న‌ట్లు తెలుస్తుంది. ఆరోజు ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. ఈ సందర్బంగా సినిమా తాలూకా అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చిత్ర‌యూనిట్ భావిస్తున్నది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవర మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ 10 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read