Monday, December 23, 2024
HomeMovie News'దేవర' డైలాగ్ లీక్!

‘దేవర’ డైలాగ్ లీక్!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న ‘దేవర’ నుంచి ఓ డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా..’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27 రానున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్ తో దేవర సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ సాంగ్ మాత్రమే రిలీజయింది. అయితే ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయని తెలుస్తుంది.

దేవర టైటిల్ సాంగ్ తో పాటు ఎన్టీఆర్, జాన్వీ మీద ఓ రొమాంటిక్ సాంగ్ ఇప్పటివరకు చిత్రీకరించారు. త్వరలోనే ఇంకో రెండు పాటలు షూట్ చేయనున్నారు. ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మొదటిసారి ఎన్టీఆర్, జాన్వీ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీతో పాటు హిందీలో వార్ 2 చిత్రంలో కూడా NTR నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న ఈ మూవీలో తారక్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవర తర్వాత కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read