Movie News

పెళ్లి పీటలు ఎక్కబోతున్న వకీల్ సాబ్ హీరోయిన్..?

నిన్ను కోరి, జై లవకుశ, వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నివేదా థామస్ పెళ్లి పీటలు ఎక్కబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. దర్బార్ చిత్రంలో రజనీకాంత్ కూతురుగా నటించి అలరించిన నివేదా థామస్… పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో మెయిన్ లీడ్ పోషించింది.

ఇకపోతే ఏమైందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో లాంగ్ గ్యాప్ ఇచ్చిందని చెప్పాలి..చివరిగా షాకిని డాకిని అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా కొరియన్ రీమేక్ గా తెరకెక్కడంతో మూవీ లవర్స్ ను మెప్పించలేకపోయింది. ఒకరకంగా చెప్పాలంటే బ్రోచేవారెవరు రా సినిమానీ ఈమెకు చివరి హిట్ అని చెప్పవచ్చు.. ఇకపోతే సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను అనౌన్స్ చేయలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. ఇక అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే ఈమె .. తన సోదరుడితో కలిసి చేసే స్టెప్పులు, డాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఈమె ఫోటోకి అనేక మంది నెటిజన్స్. తప్పుగా కామెంట్లు పెట్టారు.. అంతేకాదు పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు.. అయితే వీటి పైన ఆమె స్పందించలేదు…

కానీ ఇప్పుడు ఈమె చేసిన లేటెస్ట్ పోస్ట్ చాలా వైరల్ గా మారుతుంది. మరి నివేదా చేసిన పోస్ట్ ఏంటి అంటే .. చాలా కాలం గడిచింది.. బట్ ఫైనల్లీ అంటూ రాసుకు వచ్చింది నివేదా.. అలాగే లవ్ ఎమోజిని కూడా యాడ్ చేసింది.. దీంతో ఈమె పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్ .. ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ కామెంట్స్ చేయగా.. మరి కొంతమంది కొత్త సినిమాని అనౌన్స్ చేస్తుందేమో అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం నివేదా చేసిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.