Saturday, October 19, 2024
HomeMovie News'స్వయంభూ' క్రేజీ పోస్టర్ రిలీజ్

‘స్వయంభూ’ క్రేజీ పోస్టర్ రిలీజ్

- Advertisement -

విభిన్న కథలతో ప్రేక్షకులకు కొత్తదనం అందించడం లో యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడు ముందుంటారు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ..ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే మూవీ చేస్తున్నాడు. పిక్సెల్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా సంయుక్తా మీనన్ కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా సరికొత్త పోస్టర్ ఈరోజు నిఖిల్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ లో నిఖిల్ యుద్ధానికి సిద్దమవుతున్న పవర్ఫుల్ వారియర్ గా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా అతను కనిపిస్తూ ఉండడం విశేషం.

ఇక సినిమాకు టాప్ సినిమాటోగ్రఫర్ కేకే. సెంథిల్ కుమార్ రంగంలోకి దిగడం విశేషం. ఆయనకు స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఒక మేకింగ్ వీడియో విడుదల చేశారు. బాహుబలి, RRR లాంటి సినిమాలకు వర్క్ చేసిన సెంథిల్ అనుభవం ఇలాంటి సినిమాలకు తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఇక దీంతో సినిమాపై అంచనాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మేకర్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ను రప్పించినట్లు హీరో నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. పోస్టర్ కూడా షేర్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ను 12 రోజుల పాటు దాదాపు 700 మందితో చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఒక్క సీన్ కోసం మేకర్స్ రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read