Tuesday, December 24, 2024
HomeMovie Newsనిహారిక మెసేజ్ లకు టిల్లు షాక్..

నిహారిక మెసేజ్ లకు టిల్లు షాక్..

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై తన ప్రేమను వ్యక్తం చేసింది నాగబాబు కూతురు నిహారిక. షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన నిహారిక వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘నాన్న కూచి’ అనే వెబ్‌ సిరీస్‌ చేసింది. హ్యపి వెడ్డ్డింగ్‌తోపాటు తమిళంలో ఓ సినిమా చేసింది. చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిన్న పాత్ర చేసింది. సూర్యకాంతం తర్వాత హీరోయిన్ గా సినిమా చేయలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ బిజీ గా మారింది. ప్రస్తుతం ‘కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేసింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా వెబ్ సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేసారు. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు.

ఈ సందర్బంగా జొన్నలగడ్డ మాట్లాడుతూ..నిహారిక ఈ ఈవెంట్ కోసం రమ్మని పిలిస్తూ.. ఎక్కడున్నారు.. వస్తున్నారా.. అంటూ గారు అని మెసెజ్‌లు, కాల్స్ చేస్తుండటంతో షాక్ అయ్యా.. మనల్నే అంటోందా.. వేరే వాళ్లకి చేయబోయి.. నాకు చేసిందా? అనుకున్నాను.. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు నిహారికి గారికి థాంక్స్ అంటూ సిద్దు అందరినీ నవ్వించేశాడు. అసలు ఈ సినిమా చిన్న సినిమాలా కనిపించడం లేదని అన్నాడు. మామూలుగా అయితే చిన్న చిత్రం.. పెద్ద చిత్రం అని ఉండదని, తక్కువ ఖర్చు.. ఎక్కువ ఖర్చు పెట్టడం అనేదే ఉంటుందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read