Sunday, November 24, 2024
HomeMovie Newsపవన్ ఫై మరోసారి తన ప్రేమను బయటపెట్టిన నిహారిక

పవన్ ఫై మరోసారి తన ప్రేమను బయటపెట్టిన నిహారిక

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై తన ప్రేమను వ్యక్తం చేసింది నాగబాబు కూతురు నిహారిక. షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన నిహారిక వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘నాన్న కూచి’ అనే వెబ్‌ సిరీస్‌ చేసింది. హ్యపి వెడ్డ్డింగ్‌తోపాటు తమిళంలో ఓ సినిమా చేసింది. చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిన్న పాత్ర చేసింది. సూర్యకాంతం తర్వాత హీరోయిన్ గా సినిమా చేయలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ బిజీ గా మారింది. ప్రస్తుతం ‘కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేసింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా పవన్ ఫై తన ప్రేమను చాటుకుంది.

ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఆమె పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడారు. “నేను ఎప్పుడు వచ్చేది నెక్స్ట్‌ సీజనా.? అని నిహారిక అడగగా ఆ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్‌ మీకేంటండి.. ‘ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం గారి తాలుకా’ (Ap Deputy CM gaari taaluka) అని అన్నాడు. దాంతో పవన్‌ కళ్యాణ్‌ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్న వీడియోను ప్లే చేశారు.కల్యాణ్‌గారి సక్సెస్‌ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అని అడగగా “యుద్థం గెలిచిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలానే ఉన్నదేమో అనిపించింది” అని నిహారికా అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ను నిహారిక రాముడితో పోల్చడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ప్రస్తుతం నిహారిక మాటలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. పవన్ గెలుపు తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఎంతోమంది ఆ వీడియో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. దేశ ప్రధాని మోదీ సైతం దాని గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read