Tuesday, December 24, 2024
HomeMovie Newsఅటు ప్రభాస్..ఇటు పవన్ మధ్యలో హీరోయిన్..

అటు ప్రభాస్..ఇటు పవన్ మధ్యలో హీరోయిన్..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీ గా ఉన్నారో తెలియంది కాదు..సలార్ , కల్కి సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే క్రమంలో వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. వాటిలో మారుతీ డైరెక్షన్లో రాజాసాబ్ ఒకటి. ఈ మూవీ లో ఇస్మార్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ లో కూడా నటిస్తుంది. ఇలా ఇద్దరు స్టార్ హీరోల సరసన జోడి కడుతూ బిజీ గా ఉంది. రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీ పున:ప్రారంభం అయ్యింది. ఏపీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా..రాజాసాబ్ తెలంగాణ లో జరుగుతుంది.

ఈ రెండు షూటింగ్ లలో నిధి పాల్గొంటుంది. ఈ రెండు సినిమా షూటింగ్స్‌ ఒకే రోజు జరుగుతుండగా, ఆ రెండింటిలోను తన పాత్రకు సంబంధించిన షూట్‌లో పాల్గొన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఒకే రోజు ఇద్దరు అగ్ర హీరోలతో రెండు స్టేట్స్ లో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఈ రెండు సినిమాలు కూడా వీలైనంత త్వరగా షూటింగ్ ముగించుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న వీరమల్లు కి జ్యోతికృష్ణ(jyothi krishna)దర్శకుడు కాగా, రాజా సాబ్ కి మారుతి(maruthi)దర్శకుడు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read