Movie News

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక చోప్రా భర్త

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ఇన్ఫ్లుఎంజా-A (Influenza-A) అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చారు.

హాయ్ గాయ్స్. రెండున్నర రోజులుగా నేను నేను ఇన్ఫ్లుఎంజా-Aతో బాధపడుతున్నాను. నా అనారోగ్యం చాలా క్షిణించింది. గొంతు కొల్పోయాను. రెండు రోజులుగా పూర్తిగా మాట్లాడలేకపోతున్న. దాంతో నా షోలు అన్ని రిషెడ్యూల్ చేశాం. రెండు రోజుల క్రితం నేను నిద్ర లేచేసరికి నా గొంతలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో క్రమంలో నా గొంతు కోల్పోయాను. ఓ రోజంతా జ్వరంతో మంచానికే పరిమితం అయ్యారు. తీవ్రమైన జ్వరం, బాడీ పెయిన్స్, గొంతు నొప్పి.. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాను. వెంటనే డాక్టర్ ను సంప్రదించగా… విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో నా షోస్ క్యాన్సల్ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

నిక్ జోనస్ అమెరికన్ పాప్ సింగర్ అనే విషయం తెలిసిందే. అతడే కాదు తన సోదరులు కూడా సింగర్సే. జోనస్ బ్రదర్స్ పేరుతో వారు సొంతంగా మ్యూజిక్ బాండ్ రన్ చేస్తున్నారు. తరచూ మ్యూజిక్ కన్సర్ట్తో, షోస్తో బిజీగా ఉండే నిక్ జోనస్..ప్రియాంక చోప్రా ను పెళ్లి చేసుకొని ఇద్దరు హ్యాపీగా ఉన్నారు.