Movie News

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి లవ్లీ మెలోడీ

టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  

ఈ రోజు మేకర్స్ ప్రియమార సాంగ్ రిలీజ్ చేశారు. రధన్ సాంగ్ లవ్లీ మెలోడీ  కంపోజ్ చేశారు. రాకేందు మౌలి  రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. శరత్ సంతోష్, లిప్సిక భాష్యం వోకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. ప్రదీప్ దీపికల కెమిస్ట్రీ, ఆన్-స్క్రీన్ లవ్లీగా వుంది.  

ప్రదీప్ తొలి చిత్రం లాగానే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా సంచలనాలు సృష్టిస్తోంది.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.