Movie News

‘కాంత’ నుంచి సముద్రఖని పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ మూవీ’కాంత’ అద్భుతమైన స్టార్ కాస్ట్, ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టిస్తూనే ఉంది.  లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్,  భాగ్యశ్రీ బోర్సేల స్టన్నింగ్  ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన తర్వాత  మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు.

వెరీ ట్యాలెంటెడ్ సముద్రఖని పుట్టినరోజును పురస్కరించుకుని, టీం ఈరోజు అతని ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. అద్భుతమైన మోనోక్రోమ్ ప్యాలెట్‌లో ప్రజెంట్ చేసి ఈ పోస్టర్‌లో సముద్రఖని ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. ఈ పోస్టర్ ఇది సినిమా కాల నేపథ్యాన్ని అద్భుతంగా చూపింది. అతని ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ తో స్టైలింగ్, అతని పాత్ర కథనంలోపవర్ ఫుల్ గా ఉంటుందని సూచిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో వున్నాయి. కాంతా గొప్ప కథ, నటీనటులు, టెక్నికల్ టీంతో మస్ట వాచ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
సినిమా విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.