ఇటీవల కాలంలో నాగవంశీ పేరు గట్టిగా వినిపిస్తుంది. అగ్ర హీరోలతో చిన్న హీరోలతో వరుసగా సినెమాలు చేస్తూ వస్తున్నారు. ఇదే తరుణంలో పలు వివాదాల్లో కూడా నిలుస్తున్నారు. దీనికి ఉదాహరణే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” (Gangs Of Godavari ) సినిమా సూపర్ హిట్ అయిందంటూ, మిక్సెడ్ రివ్యూలు, నెగిటివ్ రివ్యూలు వేసినా కూడా క్లీన్ హిట్ అయిందని బ్రేక్ ఈవెన్ అయిందంటూ పోస్టర్లు రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్లు చూసిన చాలా మంది నెటిజన్లు ఈ సినిమాలో ఏమంత కంటెంట్ ఉందని హిట్టయిందో అని అంటున్నారు. హీరో విశ్వక్ సేన్ పెర్ఫార్మన్స్ పక్కన పెడితే ఈ సినిమాకి పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏమి లేవు. పుష్ప ని షార్ట్ ఫిలిం గా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేసారు. అయినా రిలీజ్ అయిన నెల తర్వాత ఇప్పుడు పోస్టర్లు వేసి క్లీన్ హిట్ అయింది అంటారేంటి అని ట్రోల్ చేస్తున్నారు.
దాదాపు 10 శాతానికి పైగా నష్టాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా. గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా 11.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కాగా, ఓవరాల్ గా 10.21 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి యావరేజ్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా క్లీన్ హిట్ అయిందంటూ పోస్టర్లు వేసినంత మాత్రాన హిట్ అయిపోతుందా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా పోస్టర్లలో నెగిటివ్, మిక్సెడ్ రివ్యూలు కూడా ఎదుర్కొని బ్రేక్ ఈవెన్ అయిందంటూ నాగవంశీ రివ్యూవర్ల మీద పడ్డాడని చెప్పొచ్చు.