లావణ్య దెబ్బ కు రాజ్ తరుణ్ సినీ కెరియర్ మొత్తం నాశనం కాబోతుందని తెలుస్తుంది. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తనతో ఉన్నాడని..పెళ్లి కూడా చేసుకున్నాడని , రెండుసార్లు కడుపు చేసి..అబార్షన్ చేసాడని..ఇప్పుడు మరో హీరోయిన్ మాయలో పడి తనను దూరం చేస్తున్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే యువతీ పోలీసులకు పిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు రాజ్ తరుణ్ ను విచారిస్తున్నారు. ఈ వ్యవహారం వల్ల రాజ్ తరుణ్ కొత్త సినిమాలకు ఇబ్బంది గా మారింది. ఇప్పటికే ఓ సినిమా వాయిదా పడగా..మిగతా సినిమాలు కూడా రిలీజ్ అవుతయో లేదో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.
తాజాగా రాజ్ తరుణ్ నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందులో ఒక సినిమాకి సంబంధించి రాజ్ తరుణ్ ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జులై 26న రాజ్ తరుణ్ నటించిన “పురుషోత్తముడు” అనే సినిమా విడులవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్లు మేకర్స్ చేస్తుండగా, పురుషోత్తముడు మూవీ పోస్టర్స్ లో రాజ్ తరుణ్ ని చూసి, ట్రోల్ చేస్తున్నారు.
నువ్వు చేసిన ఘన కార్యాలకు, నీ మొహానికి పురుషోత్తముడు అనే టైటిల్ అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. లావణ్య కేసు ఇంకా విచారణ జరుగుతున్నప్పటికీ రాజ్ తరుణ్ కి ఇలా విమర్శలు తప్పట్లేదు. రాజ్ తరుణ్ లావణ్య కేసు వల్ల తన సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు జంకుతున్నారు. పురుషోత్తముడు సినిమాతో పాటు, తిరగబడ్డారు సామీ, భలే ఉన్నాడే సినిమాలు రిలీజ్ కి రెడీ అయినా, ఈ కేసు వల్ల వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక వీటిలో పురుషోత్తముడు సినిమాను మాత్రం జులై 26న తప్పక రిలీజ్ చేస్తున్నారు