Friday, October 18, 2024
HomeMovie Newsఎస్ఎస్‌ రాజ‌మౌళి పై డాక్యుమెంటరీ..

ఎస్ఎస్‌ రాజ‌మౌళి పై డాక్యుమెంటరీ..

- Advertisement -

టాలీవుడ్ చిత్రసీమ ను కమర్షియల్ గా నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లిన దర్శకుడు ఎవరూ అంటే కళ్లు మూసుకుని రాజమౌళి అని చెప్పేయొచ్చు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో అసలు ఒక్క ప్లాఫ్ కూడా లేని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళినే అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. తన టేకింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళిపై ఇప్పుడు ఓ డాక్యుమెంటరీ సిరీస్ రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.

‘మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి’ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఈ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పించనున్నారు. ఈ డాక్యుమెంటరీలో పలువురు హాలీవుడ్‌ దర్శకులు, సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. తెలుగు పరిశ్రమలోని స్టార్‌ హీరోలు కూడా ఈ దర్శకధీరుడితో వారి అనుబంధాన్ని పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, రణ్ బీర్ కపూర్ తదితరులు జక్కన్న గురించి పంచుకున్న పలు ఆసక్తికర విషయాలను కూడా ఈ డాక్యుమెంటరీలో ప్రదర్శించనున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read