Saturday, August 30, 2025
HomeMovie NewsNC24- కీలక పాత్రలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

NC24- కీలక పాత్రలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

తండేల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో అదరగొట్టిన యువ సామ్రాట్ నాగ చైతన్య, విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ థ్రిల్లర్ #NC24 చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.

- Advertisement -

లాపతా లేడీస్ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవను అఫీషియల్ గా ఈ చిత్రానికి స్వాగతించారు మేకర్స్. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్తవ, ఇప్పుడు తొలిసారి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో పాత్-బ్రేకింగ్ అవుతుందని శ్రీవాస్తవకి టీమ్ బెస్ట్ విషెస్ తెలిపింది.

“NC24 – The Excavation Begins” ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన వెంటనే బిగ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా స్కేలు, ఇంటెన్స్ మూడ్‌ని ప్రజెంట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకుంది.

#NC24 మిస్టరీ, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్‌తో జానర్-డిఫైనింగ్ మైథికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. కార్తిక్ డండు యూనిక్ స్టోరీటెల్లింగ్, SVCC – సుకుమార్ రైటింగ్స్ స్ట్రాంగ్ సపోర్ట్, నాగచైతన్య కొత్త డైమెన్షన్‌లో యాక్టింగ్, ఇప్పుడు స్పర్ష్ శ్రీవాస్తవ లాంటి యాక్టర్స్ జాయిన్ అవ్వడంతో, సినిమాపై అన్ని ఇండస్ట్రీస్‌లోనూ భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మైథ్-బేస్డ్ థ్రిల్లర్స్ కి కొత్త బౌండరీలు చూపించేలా ఒక వరల్డ్-క్లాస్ సినిమా ఇవ్వాలని టీమ్ కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తోంది.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల మొదలుకానుంది. సినిమా జర్నీ గురించి మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read