Movie News

“మూకుతి అమ్మన్ 2” పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

రూ.1 కోటి విలువైన సెట్ లో గ్రాండ్ గా జరిగిన పూజా కార్యక్రమం

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో ‘మూకుతి అమ్మన్ 2’ నిర్మాణం

నయనతార లీడ్ రోల్ లో సుందర్ సి దర్శకత్వంలో తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటైన వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌లలో ఒకటైన ‘మూకుతి అమ్మన్ 2’ను నిర్మిస్తోంది. అవ్ని సినిమాక్స్ (పి) లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ సహా నిర్మాతలుగా వున్నాయి.

ఈ చిత్రం ఈరోజు (మార్చి 6)  రూ1 కోటి విలువైన అద్భుతమైన సెట్ వర్క్‌తో గ్రాండ్ పూజా వేడుకతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సిబ్బందితో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సునీల్ నారంగ్, జగదీష్, సి కళ్యాణ్ పాల్గొన్నారు.

మూకుతి అమ్మన్ పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించింది, తెలుగు డబ్బింగ్ వెర్షన్ అమ్మోరు తల్లికి  బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించింది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ డాక్టర్ ఇషారి కె గణేష్ ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి మూకుతి అమ్మన్ 2ను భారీ స్థాయిలో విజువల్ వండర్ గా నిర్మిస్తున్నారు. ఈ స్టాండ్ ఎలోన్ మూవీ ‘కింగ్ ఆఫ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్’ – సుందర్ సి  మిడాస్-టచ్‌తో ఫ్రాంచైజీని కలిగి ఉంటుంది.

‘మూకుతి అమ్మన్ 2’ అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన ఎక్సయిటింగ్ కథాంశంతో వుంటుంది. సుందర్ సి, నయనతార తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

నయనతార లీడ్ రోల్ లో నటిస్తుండగా, దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగి బాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్, సింగం పులి, విచ్చు విశ్వనాథ్, ఇనియా, మైనా నందిని ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. గోపీ అమర్‌నాథ్ సినిమాటోగ్రాఫర్, ఫెన్నీ ఆలివర్ ఎడిటర్. వెంకట్ రాఘవన్ సంభాషణలు అందిస్తున్నారు, గురురాజ్ ఆర్ట్ వర్క్‌లను పర్యవేక్షిస్తున్నారు. రాజశేఖర్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు.

మూకుత్తి అమ్మన్ 2  ఎక్సయిటింగ్ యాక్షన్, బలమైన కథాంశం,అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఈ చిత్రం అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో పాన్ ఇండియా విడుదల కానుంది.