నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకెళ్తోంది లేడీ సూపర్‌స్టార్ నయనతార. జానర్‌తో తేడా లేకుండా తన నటనతో ఎన్నో హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. అయితే తన కెరీర్లో ఓ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికీ బాధపడుతున్నాని తెలిపింది. మలయాళం సినిమాలతో సినీ అరంగేట్రం చేసిన నయన, ఆ తర్వాత తమిళం, తెలుగు సినిమాల్లో మెరిసి మెప్పిచింది. అగ్రహీరోల సరసన నటించి అనతికాలంలోనే మంచి స్టార్డమ్ సాధించింది. షారుక్- అట్లీ కాంబోలో వచ్చిన ‘జవాన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే తన కెరీర్లో ఓ క్యారెక్ట్‌లో నటించినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాని..ఆ క్యారెక్టర్ చేసి పెద్ద తప్పు చేసానని చెప్పుకొచ్చింది.
సూర్య లీడ్ రోల్లో విడుదలైన ‘గజినీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద మాసివ్ సకెస్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అందులో అసిన్‌తో పాటు నయన్ కూడా ఫిమేల్ లీడ్‌గా కనిపించింది. చిత్ర అనే మెడికల్ స్టూడెంట్‌గా నయన్ ఈ చిత్రంలో నటించింది. అయితే ఆ పాత్ర తన సినీ కెరీర్లోనే అత్యంత చెత్త ఎంపిక అంటూ వ్యాఖ్యానించింది. తాను ఇప్పటివరకు నటించిన సినిమాల మొత్తంలో ‘గజిని’లో యాక్ట్ చేసినందుకు మాత్రమే చింతిస్తున్నానంటూ వెల్లడించింది. ఈ చిత్రంలో తన పాత్రను తనకు చెప్పినట్లుగా చిత్రీకరించలేదని, తనను చెత్తగా ఫోటోలు తీశారంటూ చెప్పింది. ఆ సమయంలో ఆ విషయాన్ని తాను పట్టించుకోలేదని దాన్ని ఓ లెర్నింగ్ ప్రాసెస్‌గా భావించానంటూ తెలిపింది.