Thursday, December 26, 2024
HomeMovie News'గజినీ' లో నటించి పెద్ద తప్పు చేశా - నయనతార

‘గజినీ’ లో నటించి పెద్ద తప్పు చేశా – నయనతార

- Advertisement -

నార్త్​, సౌత్​ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకెళ్తోంది లేడీ సూపర్​స్టార్ నయనతార. జానర్​తో తేడా లేకుండా తన నటనతో ఎన్నో హిట్​ సినిమాలను ఖాతాలో వేసుకుంది. అయితే తన కెరీర్​లో ఓ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికీ బాధపడుతున్నాని తెలిపింది. మలయాళం సినిమాలతో సినీ అరంగేట్రం చేసిన నయన, ఆ తర్వాత తమిళం, తెలుగు సినిమాల్లో మెరిసి మెప్పిచింది. అగ్రహీరోల సరసన నటించి అనతికాలంలోనే మంచి స్టార్​డమ్​ సాధించింది. షారుక్​- అట్లీ కాంబోలో వచ్చిన ‘జవాన్’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ సంపాదించుకుంది. అయితే తన కెరీర్​లో ఓ క్యారెక్ట్​లో నటించినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాని..ఆ క్యారెక్టర్ చేసి పెద్ద తప్పు చేసానని చెప్పుకొచ్చింది.

సూర్య లీడ్​ రోల్​లో విడుదలైన ‘గజినీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద మాసివ్ సకెస్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అందులో అసిన్​తో పాటు నయన్​ కూడా ఫిమేల్ లీడ్​గా కనిపించింది. చిత్ర అనే మెడికల్ స్టూడెంట్​గా నయన్ ఈ చిత్రంలో నటించింది. అయితే ఆ పాత్ర త‌న సినీ కెరీర్​లోనే అత్యంత చెత్త ఎంపిక‌ అంటూ వ్యాఖ్యానించింది. తాను ఇప్పటివరకు నటించిన సినిమాల‌ మొత్తంలో ‘గజిని’లో యాక్ట్ చేసినందుకు మాత్రమే చింతిస్తున్నానంటూ వెల్లడించింది. ఈ చిత్రంలో తన పాత్రను త‌న‌కు చెప్పినట్లుగా చిత్రీక‌రించ‌లేదని, తనను చెత్త‌గా ఫోటోలు తీశారంటూ చెప్పింది. ఆ సమయంలో ఆ విషయాన్ని తాను పట్టించుకోలేదని దాన్ని ఓ లెర్నింగ్ ప్రాసెస్​గా భావించానంటూ తెలిపింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read