Movie News

నయనతార కర్మ సిద్ధాంతాం పోస్ట్

కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు హీరో ధనుష్ మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నయనతార జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయంలో ఈ వివాదం చెలరేగింది. నయనతార కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఇందులో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాకు చెందిన మూడు సెకన్ల వీడియో క్లిప్‌ను ఉపయోగించారు. ఈ సినిమా నిర్మాత అయిన ధనుష్, వీరు తన అనుమతి లేకుండా వీడియోను ఉపయోగించినందుకు రూ.10 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు. ఈ వివాదం మరింత తీవ్రతరం అవడంతో ధనుష్, నయనతార మరియు విఘ్నేశ్ శివన్‌లపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ ఘటనల నేపథ్యంలో నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ధనుష్‌ను ఉద్దేశించినట్లు భావించే ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.అబద్ధాలతో ఇతరుల జీవితాలను నాశనం చేస్తే, దాన్ని ఒక అప్పులాగా భావించండి. అది ఎప్పటికైనా వడ్డీతో సహా మీ వద్దకు తిరిగి వస్తుంది అని పోస్ట్ చేయడం తో ఇది ఖచ్చితంగా ధనుష్ ను ఉద్దేశించే అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇందులో నయనతార కెరీర్, వ్యక్తిగత జీవితంలోని ఎదురుదెబ్బలు, విమర్శలు, మరియు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమకథ, వివాహ వేడుక వంటి అంశాలను ప్రాముఖ్యంగా చూపించారు.