Movie News

నవీన్ పోలిశెట్టి పెళ్లి చేసుకున్నాడా..? ఏంటి నిజమే..?

ఇటీవల యంగ్ హీరోలు , హీరోయిన్ల అంత పెళ్లి బాట పడుతున్నారు. కెరియర్ లో రాణిస్తూనే పర్సనల్ లైఫ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకొని ఏడు అడుగులువేస్తున్నారు. ఇటీవల ఆలా చాలామంది నటి నటులు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నాడనే ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఒకప్పుడు స్టాండ్ అప్ కమెడియన్ గా పేరు తెచ్చుకొని, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు చేసి హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నవీన్.. ఒక్క సినిమాతో తనదైన మాట నటనతో యువతకు దగ్గరై పోయారు. ఏ కథ దొరికితే ఆ కథ చెయ్యకుండా మంచి సినిమా కథ కోసం ఎదురు చూసి.. ఆ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు తన ఖాతాలో విజయాలను కూడా వేసుకుంటున్నాడు. అలంటి నవీన్ .. అమెరికా లో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఇది జరిగి చాలా నెలలు అవుతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇకపోతే చాలా రోజుల తర్వాత నవీన్ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.. సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదల సమయంలో అమెరికా వెళ్లిన ఆయన ఇప్పటికీ తిరిగి రాలేదు. పైగా ఒక చిన్న ప్రమాదం కూడా జరిగింది. చేయికి దెబ్బ తగిలిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇప్పటికీ చేతికి కట్టుతోనే ఉంటున్నాను అని మొన్నా మధ్య ఒక వీడియో కూడా వదిలాడు.

అయితే చడీ చప్పుడు కాకుండా చటుక్కున ఫిలింఫేర్ అవార్డు వేడుకల్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు నవీన్ పోలిశెట్టి. అయితే అలా కనిపించారో లేదో అప్పుడే అదృశ్యం అయిపోయారు. మరి ఇప్పుడు ఆయన అమెరికా వెళ్లారా ? లేక ముంబై వెళ్లారా? అన్నది మాత్రం తెలియదు. కానీ ప్రస్తుతం ఈయనకు పెళ్లి జరిగిందని అందుకే వెంటనే భార్య దగ్గరకు వెళ్లిపోయాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.