నేచురల్ స్టార్ నాని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన రా అండ్ రస్టిక్ బ్లాక్ బ్లాక్ బస్టర్ ‘దసరా’ ప్రేక్షకులని అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. నాని మరోసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, SLV సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరితో కలిసి మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం కొలాబరేట్ అయ్యారు. వారి న్యూ మూవీ ‘ది ప్యారడైజ్’ లో నాని మరో బోల్డ్, లార్జర్-దాన్-లైఫ్ పాత్రలో అలరించబోతున్నారు.
ఈరోజు, మేకర్స్ ‘రా స్టేట్‌మెంట్’ అనే గ్లింప్‌ను రిలీజ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్రేమ్ నుండే “రా” అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారో అర్థం వచ్చేలా ప్రజెంట్ చేసింది. భాష, కథనం, నేపథ్యం అన్నీ అన్ రిఫైండ్ గా వున్నాయి. ఒక పవర్ వాయిస్ ఓవర్ కథ ముఖ్యాంశాన్ని అందిస్తుంది. “చరిత్రలో అందరూ చిలకలు పావురాలు గురించి రాసిర్రు గానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ. అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ. ఒక దగడ్ వొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. థూ.. అనిపించుకున్న కాకులు తల్వార్ లు పట్టినాయ్. ఇది ఆ కాలులని ఒక్కటి చేసిన తిరుగుబాటుదారుడి కథ ఇది.. ఆ యువకుడు నాయకుడిగా మారిన కథ’ ఈ పవర్ వాయిస్ ఓవర్ ప్రేక్షకులని కట్టిపడేసింది.
బిగినింగ్ షాట్లు మృతదేహాలతో నిండిన మురికివాడలను, ఎగురుతున్న కాకులను చూపుతాయి. ఆ తర్వాత, ఒక భారీ పేలుడు హీరో నాని ఎంట్రీని సూచిస్తుంది, అతను ఊహించని గెటప్‌లో బయటకు వస్తాడు. బూట్లకు కట్టుకున్న గడియారం, నీటిలో నుండి తీసిన తుపాకీతో రగ్గడ్ లుక్‌తో, దృఢ సంకల్పంతో నడుస్తూ, తన ప్రజలను గర్వంతో నడిపిస్తాడు. అతని లాంగ్వేజ్ ఫిజిక్, రెండు జడలతో హైలైట్ చేయబడింది. పాత్ర ఇంటన్సిటీని వెంటనే తెలియజేస్తుంది. హీరో అనే పదంతో అతని బెల్ట్, ప్రజల నాయకుడిగా అతని పాత్రను సూచిస్తుంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి తన విజనరీ ఫిల్మ్ మేకర్ ని నిరూపించుకున్నాడు, మొదటి ఫ్రేమ్ నుండే ప్రేక్షకులను ఆకట్టుకునే ఇంటెన్స్, లీనమయ్యే ప్రపంచాన్ని అద్భుతంగా చూపించాడు.ఎక్స్ ట్రార్డినరీ స్టొరీ టెల్లింగ్, ఇంటెన్స్ తో కూడిన పాత్రను ప్రదర్శించడం ద్వారా నాని ప్రజెన్స్ రీడిఫైన్ చేశాడు.
రా స్టేట్‌మెంట్ ద్వారా అనౌన్స్ చేసినట్లుగా, ది ప్యారడైజ్ మార్చి 26, 2026న థియేటర్స్ లో విడుదల కానుంది.