Monday, December 23, 2024
HomeNRIఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
ఫిలడెల్ఫియా: డిసెంబర్:13

- Advertisement -

ఔరా అనిపించిన తెలుగు చిన్నారుల ప్రతిభ ప్రదర్శనలు

అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలు నిర్వహించింది. ఫిలడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్  వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి.. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. తెలుగు చిన్నారుల్లో  ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 120 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.  బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. ఎనిమిదిఏళ్ళలోపు,  పన్నెండుఏళ్ళలోపు, పన్నెండుఏళ్ళపైన ఉన్న చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు.. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.. 

నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ హరినాథ్ బుంగటావుల, సరోజ సాగరం, శ్రీనివాస్ సాగరం, రవి ఇంద్రకంటి, బాబు మేడి, రామకృష్ణ గొర్రెపాటి, పార్ధ మాదాల, అపర్ణ సాగరం, మాలిని గట్టు, సురేంద్ర ఈదర, మధు కొల్లి, సురేష్ బొందుగుల, మధు బూదాటి, సాయి సుదర్శన్ లింగుట్ల, లవ కుమార్ ఐనంపూడి, శ్రీకాంత్ చుండూరి, రమణ రాకోతు, ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు రామ్ నరేష్ కొమ్మనబోయిన, మురళి మేడిచెర్ల, బోర్డు సెక్రెటరీ శ్యామ్ నాళం,  నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి,  తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. ఇంకా ఈ కార్య క్రమంలో నాట్స్ సంబరాలు కల్చరల్ టీం సభ్యులు బిందు యలంచిలి, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి వేదగిరి, ఓం నక్క, కిరణ్ తవ్వ , టి ఏ జి డి వి అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ షేక్, మాజీ అధ్యక్షులు కిరణ్ కొత్తపల్లి, తదితరులు పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు శ్రీనివాస్ చాగంటి, అన్నపూర్ణ చాగంటి, భాస్కరి బుధవరపు, సింధు బుధవరపు, అంజని వేమగిరి, వల్లి పిల్లుట్ల, సునంద గంధం, ప్రత్యుష నాయర్, శ్రీదేవి ముంగర, చిన్మయి ముంగర, నిర్మల రాజ్, లావణ్య న్, శ్రీనిధి దండిభొట్ల, విద్య షాపుష్కర్, రఘు షాపుష్కర్, మల్లి చామర్తి, సురేష్ యలమంచి  ఈ సంబరాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యపహరించారు. శ్రీయ గొర్రెపాటి గణేశ ప్రార్ధనతో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయిన ఈ కార్యక్రమము రాత్రి పది గంటలవరుకు నిర్విరామముగా నూట అరవై పైగా చిన్నారుల ప్రదర్శనలతో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ధాత్రి గంధం, శ్రీనిజ దండిభొట్ల, స్నేహ ఇంద్రకంటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

తెలుగు బాల బాలికలను  ప్రోత్సహించడానికి, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక  వేదిక ఈ బాలల సంబరాలు కార్యక్రమమని నాట్స్ సంబరాలు కన్వీనర్ శ్రీధర్ అప్పసాని అన్నారు. బాలల సంబరాలను దిగ్విజయవంతంగా నిర్వహయించిన నాట్స్ ఫిలడెల్ఫియా చాప్టర్ కార్యవర్గ సభ్యులందరికి  ప్రత్యేక అభినందనలు తెలియ చేసారు. అమెరికాలో తెలుగు చిన్నారుల కోసం నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఘనంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

గ్రాండ్ స్పాన్సర్ బావర్చి బిర్యానీస్, స్పాన్సర్స్ ఓపెరా టెక్నాలజీస్, లక్ష్మి మోపర్తి న్యూయార్క్ లైఫ్, డివైన్ ఐటీ సర్వీసెస్, లావణ్య & సురేష్ బొందుగుల, సాఫ్ట్ స్కూల్స్.కామ్ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించాయి..

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read