ప్రశంస వస్తే ఆ అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది. ఇలాంటి అనుభూతి గత ఐదేళ్ల నుంచి తెలుగు చిత్ర సీమలో కరువైంది. గత ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వం నంది అవార్డులను పూర్తిగా దూరం పెట్టింది. ఇక తెలంగాణ ప్రభుత్వంలో అయితే గత 10 ఏళ్ల నుంచి నంది ఊసే లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తున్నట్టు అనౌన్స్ చేసింది.
ఇప్పుడు ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఇప్పుటి వరకు విస్మరణ గురైన సినిమా ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దీనిపై సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – నిర్మాతల మధ్య జరిగిన మీటింగ్‌లో కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – తెలుగు చిత్ర సీమ నిర్మాతల మధ్య జరగబోయే మీటింగ్‌లో పూర్తి స్పష్టత రానుంది.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం… సీఎం చంద్రబాబు.. సినిమా ప్రముఖులతో సఖ్యతగా ఉండాలని అనుకుంటున్నారట. గత ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్ చాలా దూరం నడిపంచారని, మీటింగ్‌లో కూడా అవమానించారని ఫ్యాన్స్, సినిమా అభిమానుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒక్కటి అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. దీంతో తమ ప్రభుత్వంలో ఇలాంటివి జరగకూడదని సీఎం అనుకుంటున్నారట. అందుకే ఏపీ ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన సినిమాటోగ్రఫి మంత్రి కందుల సురేష్ బాధ్యతలు తీసుకునే ముందు మెగాస్టార్ చిరంజీవిని షూటింగ్ స్పాట్ కి వెళ్లి మరీ కలిసి వచ్చారు. పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవిని సన్మానించాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. అదే వేదికపైన నంది అవార్డుల గురించి ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.