Tuesday, December 24, 2024
HomeMovie Newsహనుమాన్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ ..?

హనుమాన్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ ..?

- Advertisement -

నందమూరి అభిమానులకి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట బాలకృష్ణ. ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పైగా మోక్షజ్ఞకి ఇప్పటికే 29 ఏళ్లు వచ్చేశాయి. దీంతో వీలైనంత త్వరగా వారసుడ్ని లాంఛ్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా బాలయ్య ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారట. తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయం చేస్తానని చెపుతున్నాడు.

మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారని టాక్. ఈ ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రశాంత్ వర్మ. అలాంటి యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞను లాంఛ్ చేస్తే బావుంటుందని బాలయ్య భావిస్తున్నారట. అధికారికంగా ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు కానీ ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తారో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read