Tuesday, December 24, 2024
HomeMovie Newsదెబ్బకు నాగ్ దారికొచ్చాడు

దెబ్బకు నాగ్ దారికొచ్చాడు

- Advertisement -

కింగ్ నాగార్జున వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ రీసెంట్ గా విమానాశ్రయంలో ఓ వివాదంలో చిక్కుకున్నాడు. నాగ్ అభిమానిని ఆయన బాడీగార్డ్ తోసేసిన ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీనిపై సదరు అభిమానికి సారీ కూడా చెప్పాడు. ఇదే తరుణంలో మరో వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో లో నాగ్ అభిమానులతో సరదాగా సెల్ఫీ ఇస్తూ వారిని సంతోష పెడుతున్నాడు.

అలాగే ఆయన బాడీ గార్డ్స్ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరిని నాగ్ తో ఫోటోలు దిగడానికి అనుమతిస్తున్నారు. ఈ వీడియోని చూశాక నిన్న ఆయనను దారుణంగా ట్రోల్ చేసిన వాళ్లంతా దెబ్బకు దారిలోకి వచ్చాడు. ఈ జాగ్రత్త ఏదో ముందే ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఇలా డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే అవసరం ఉండేది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నాగ్ అభిమానులు మాత్రం అనుకోకుండా జరిగిన ఆ విషయానికి నాగార్జునను టార్గెట్ చేసి మాట్లాడారు. నిన్న అనవసరంగా ఆయనను బ్లేమ్ చేసిన వారికి ఈరోజు ఈ వీడియో కనిపించట్లేదా ? అంటూ మండిపడుతున్నారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Where has humanity gone? <a href=”https://twitter.com/hashtag/nagarjuna?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#nagarjuna</a> <a href=”https://t.co/qnPjJngIxM”>pic.twitter.com/qnPjJngIxM</a></p>&mdash; Viral Bhayani (@viralbhayani77) <a href=”https://twitter.com/viralbhayani77/status/1804893182326685722?ref_src=twsrc%5Etfw”>June 23, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read