Wednesday, December 25, 2024
HomeMovie Newsసింపుల్ గా నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్

సింపుల్ గా నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. గతంలో నటి సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు..కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో కోర్ట్ ద్వారా అధికారికంగా విడాకులు తీసుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత చైతు శోభిత ప్రేమలో పడ్డాడు. కొంతకాలంగా రహస్యంగా ప్రేమించుకున్న వీరిద్దరూ..ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒకటి అయ్యేందుకు డిసైడ్ అయ్యారు.

ఈ క్రమంలో ఈరోజు ఉదయం నాగార్జున నివాసంలో చాల సింపుల్ గా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ధ్రువీకరిస్తూ, శోభితను ఎంతో సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్ లో పంచుకున్న నాగార్జున వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read