‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనేది లయన్ కింగ్ సినిమా యొక్క ప్రీక్వెల్‌గా రూపొందించబడింది. ఈ సినిమాలో ముఫాసా రాజుగా ఎలా మారాడో, అతని గత చరిత్ర ఏమిటో, మరియు అతని యాత్రలో ఎలా దూరంగా వెళ్లిపోయాడు అనేదాన్ని చూపిస్తుంది. కథ ప్రధానంగా ముఫాసా, టాకా (స్కార్) మరియు శారభి అనే సింహాల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, ద్వేషం మరియు యుద్ధాలపై ఆధారపడుతుంది.
కథలో ముఫాసా చిన్నతనంలో ఓ అనాథగా ఉంటాడు. వరదల్లో కుటుంబం నుంచి దూరమై, జలపాతం ద్వారా టాకా అనే సింహా రాజ్యం చేరుకుంటాడు. అక్కడ ఒబిసి రాజు ముఫాసాను అనాథగా పరిగణించి, అతన్ని చిన్నచూపు చూస్తాడు. అయితే, టాకా ముఫాసాను అన్నిలా భావించి, అతని పక్కన నిలబడి కఠినమైన పరిస్థుతుల నుండి బయటపడతాడు. కథలో ఏం జరిగిందంటే, ముఫాసా తన సోదరుడి స్కార్‌తో పాటు చెడు చీకటి ప్రదేశాలలో సాగతీయడం.
కథ పరంగా ఇది తెలుగు సినిమాల్లో మనం తరచుగా చూస్తేను కనిపించే అంశాలతో కూడినదే. అయితే, సింహాలు మరియు జంతువుల ఆధారంగా సృష్టించిన ఒక కొత్త ప్రపంచం, గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్‌తో ఈ సినిమా ప్రత్యేకంగా మారింది. ముఫాసా మరియు సింబా పాత్రలు పిల్లలకు గాఢంగా కనెక్ట్ అయ్యాయి.
ఈ చిత్రం లో తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేయబడింది. మహేష్ బాబు వంటి ప్రముఖ నటుల వాయిస్ ఓవర్ తో, తెలుగు ప్రేక్షకులకు మరింత సాన్నిహిత్యంగా అనిపించక తప్పదు. కొన్ని సీన్‌లలో పంచ్‌లు, సెటైర్లు ఆడియెన్స్‌కు నవ్వులు తెప్పిస్తాయి. సింప్లిసిటీకి లోబడి, సింహాల ప్రపంచం విశ్వరూపంగా చూపించిన దర్శకుడు విజువల్‌గా మంచి ప్రయాణాన్ని అందించాడు.
మొత్తం మీద ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా హాలీవుడ్ యొక్క స్టాండర్డ్ టెక్నికల్ ప్రామాణికతను చూపిస్తూ, విజువల్ వండర్‌గా నిలబడింది. బీ, సీ సెంటర్లలో ఈ చిత్రం ఎంతవరకు చేరుకుంటుందో చూడాలి. మల్టీప్లెక్సుల్లో మాత్రం ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చెప్పొచ్చు.