Monday, December 23, 2024
HomeMovie Newsబ్లాక్ బస్టర్ సీక్వెల్ లో మృణాల్ కు ఛాన్స్

బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో మృణాల్ కు ఛాన్స్

- Advertisement -

మృణాల్ ఠాకూర్..ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది. సీతారామం మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది..ఫస్ట్ మూవీ తోనే యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఇక నాన్న మూవీ తో మరో సూపర్ హిట్ కొట్టి..అసలైన గ్లామర్ తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ఈ రెండు సూపర్ హిట్ల తర్వాత విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ మూవీ లో నటించింది. ఈ సినిమా ఫై గప్పెడు ఆశలు పెట్టుకుంది కానీ..ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి.

తాజాగా బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగణ్- సంజయ్ దత్ సూపర్ హిట్ ‘సన్​ ఆఫ్ సర్దార్’ సీక్వెల్​లో మృణాల్​ హీరోయిన్​గా ఎంపికైనట్లు సమాచారం. టాలీవుడ్ హిట్ మూవీ ‘మర్యాద రామన్న’ సినిమాకు అప్పట్లో ఇది రీమేక్​గా తెరకెక్కింది. తొలి భాగంలో సోనాక్షి సిన్హా హీరోయిన్​గా నటించగా, సీక్వెల్​లో ఆ పాత్రలో మృణాల్ కనిపిచనుందని టాక్. ఇక ఫస్ట్​ పార్ట్​తో సీక్వెల్​కు ఎలాంటి సంబంధం లేదట. ఈ కథ కొత్తగా ఉంటుందని ​మూవీటీమ్ చెపుతుంది.’ఈ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించడానికి మృణాల్‌ చాలా ఉత్సాహంగా ఉంది. త్వరలో షూటింగ్​ ప్రారంభిస్తాం. సన్నాహాలు చేస్తున్నాం’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read