Tuesday, December 24, 2024
HomeMovie Newsసినీ లవర్స్ కు గుడ్ న్యూస్..రూ. 99కే మల్టిప్లెక్స్ సినిమా చూసేయ్యొచ్చు

సినీ లవర్స్ కు గుడ్ న్యూస్..రూ. 99కే మల్టిప్లెక్స్ సినిమా చూసేయ్యొచ్చు

- Advertisement -

మే 31 ‘సినిమా లవర్స్​ డే’ సందర్భంగా కేవలం రూ. 99కే సినిమా చూసే అవకాశం. ఈ ఆఫర్ ఒక్కరోజు సింగిల్ స్క్రీన్స్​తోపాటు మల్టిప్లెక్స్​ల్లోనూ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ​పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీపోలిస్ ఇండియా, మిరాజ్‌ సినిమాస్‌, మూవీ మ్యాక్స్‌ సహా ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ ఆఫర్​తో సింగిల్ స్క్రీన్​లలో కొన్ని థియేటర్లలో రూ.70 కంటే తక్కువ ధరకే టికెట్ కొనుగోలు చేయవచ్చు. కాగా, 2022లో సినిమా దినోత్సవం సందర్భంగా ఇదే ఆఫర్ ప్రకటించగా, అప్పుడు 65 లక్షల మంది థియేటర్లలో సినిమాలు చూశారు.

కాగా, ఈ వేసవి సెలవుల్లో సినీ లవర్స్‌కు నిరాశే మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా.. అదే సమయంలో ఐపీఎల్‌ సీజన్‌ కారణంగా ఈ సమ్మర్‌లో పెద్ద హీరోల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. విడుదలైన చిన్న చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టులోకపోయాయి. దీంతో థియేటర్‌ నిర్వాహకులకు తీవ్ర దెబ్బపడింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను మళ్లీ థియేటర్లవైపు రప్పించే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే మల్టీప్లెక్స్ అసోసియేషన్ టిక్కెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది. రూ.99కే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read