బొమ్మరిల్లు ఫేమ్ సిద్దార్థ్ కు కొవ్వు ఇంకా తగ్గలేనట్లుది..ఇప్పుడు అంత ఇదే అంటున్నారు. బాయ్స్ , బొమ్మరిల్లు , నువ్వు వస్తానంటే నేను వద్దంటానా వంటి హిట్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్దార్థ్..ఆ తర్వాత అతి ఎక్కువై..ఛాన్సులకు దూరం అయ్యాడు. నిత్యం మీడియా తో వివాదాలు కొనితెచ్చుకునే ఈయన..తాజాగా భారతీయుడు 2 ప్రెస్ మీట్ లో కూడా అలాగే అతి చేసి మీడియా చేత చివాట్లు తిన్నాడు. శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా సిద్దార్థ్, రకుల్ , సముద్రఖని , SJ సూర్య తదితరులు నటించిన భారతీయుడు 2 ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా సిద్దార్థ్ మాట్లాడుతూ..ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు చేసిన సూచన అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ టైంలో ఏదైనా వెసులు బాటు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌ల మీద అవగాహన కల్పించేలా ఓ వీడియోని క్రియేట్ చేసి ఇవ్వాలనే కండీషన్ పెట్టాడు. ఇదే విషయం మీద ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న వేశాడు.
భారతీయుడు 2 యూనిట్ ఏమీ అదనపు షోల కోసం గానీ, టికెట్ రేట్ల పెంపు గురించి కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. కానీ ఆ ప్రశ్నను మాత్రం అడిగారు. అడిగిన ఆ ప్రశ్నలో అసలు మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత ఉందా? అని కాస్త సెటైరికల్‌గా అడిగేశాడు. దానికి సిద్దార్థ్ కాస్త పరుషంగానే సమాధానం ఇచ్చాడు.
నేను గత 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసు.. 2005లోనే నేను కండోమ్ యాడ్ చేశాను.. కండోమ్ చేతిలో పట్టుకుని యాడ్ చేస్తే.. ఆ పోస్టర్లు బిల్ బోర్డ్‌ల మీద కనిపించేవి.. 2005 నుంచి 11 వరకు ఆ యాడ్ కనిపించింది.. అది నా బాధ్యత.. ఓ సీఎం చెబితే ఆ బాధ్యత రాదు.. ఓ యాక్టర్‌కి ఎప్పుడూ బాధ్యత ఉంటుంది.. మీరు అడిగిన ప్రశ్నకు అర్థం లేదు.. దానికి నో కామెంట్.. ఏ సీఎం అయినా మమ్మల్ని అడిగితే చేస్తాం.. కానీ ఇంత వరకు ఏ సీఎం కూడా ఇది చేయండి.. మీకు అది చేస్తా అని చెప్పలేదు అని అన్నాడు. ఈయన మాటలపై సగటు ప్రేక్షకుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెరపై హీరోగా కనిపిస్తే చాలదు..సమాజం పట్ల కాస్త బాధ్యత కూడా ఉండాలి..అప్పుడే హీరో అనిపించుకుంటుంది అని సిద్దార్థ్ ఫై చివాట్లు పెడుతున్నారు.