Saturday, January 11, 2025
HomeMovie Newsమోక్షజ్ఞ - కొత్త లుక్ వైరల్

మోక్షజ్ఞ – కొత్త లుక్ వైరల్

- Advertisement -

నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సిద్దమైన సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ యంగ్ టాలెంటెడ్​ డైరెక్టర్​ ప్రశాంత్ వర్మతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ ఎలా ఉండబోతుందా? అని నందమూరి ఫ్యాన్స్​లో తెగ ఆసక్తి మొదలైంది. తాజాగా ఇప్పుడు మోక్షజ్ఞ షూటింగ్​ సెట్స్​లోకి అడుగుపెట్టి, యాక్షన్‌ కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసాడు. ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ విడుదల చేసిన మోక్షజ్ఞ లుక్​ చూసి అభిమానులంతా ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్​ ఓ రేంజ్​లో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో మోక్షజ్ఞ అద్దంలో చూసుకుంటూ లైట్ బియర్డ్​తో స్టైలిష్​గా కనిపించారు.

బ్లూ కలర్ చెక్​ షర్ట్​లో కనిపించారు. ‘దీనికి రెడీ ఫర్ సమ్ యాక్షజ్ఞ?'(“యాక్షన్‌ కోసం సిద్ధమా?”) అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇకపోతే మోక్షజ్ఞ మూవీలో హీరోయిన్​గా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాశి థడాని నటిస్తోందని తెలుస్తోంది. ఈ యంగ్ బ్యూటీ మోక్షుతో రొమాన్స్ చేయనుందని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. ఈ సినిమా ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్నట్లు సమాచారం. హను- మాన్ లానే ఈ చిత్రంలోనూ భారీ గ్రాఫిక్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలో హీరో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read