Friday, October 18, 2024
HomeMovie Newsమోహన్ బాబు..ప్రభాస్ ను 'బావ' అనడమే తప్ప..?

మోహన్ బాబు..ప్రభాస్ ను ‘బావ’ అనడమే తప్ప..?

- Advertisement -

ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీని ట్రోలర్స్ ఓ ఆటాడుకుంటున్న సంగతి తెలిసిందే. వాళ్లు మంచికి ట్వీట్ చేసినా.. చెడుకి ట్వీట్ చేసినా ట్రోలర్స్ అయితే ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఎక్స్ ట్రాలు చేస్తే పోలీస్ కేసులు పెడతామని మంచు విష్ణు నేరుగా వార్నింగ్‌లు ఇచ్చినా సరే.. ట్రోలర్స్ మాత్రం ‘మంచు ఫ్యామిలీ’ని వదలడం లేదు.

తాజాగా ప్రభాస్ ‘కల్కి’ మూవీ చూసిన మోహన్ బాబు.. ట్వీట్ పెట్టారు. ‘ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను.. అద్భుతం.. మహాద్భుతం.. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను’ అంటూ ట్వీట్ పెట్టారు. దీనిపై కూడా ట్రోల్ర్స్ సెటైర్లువేయడం మొదలుపెట్టారు. ఆయన పద్దతిగానే ట్వీట్ పెట్టారు కదరా నాయనా.. అందులో ట్రోలింగ్ కంటెంట్ ఏముందంటే.. ‘బావ’ అనే పిలుపులోనే అసలు సమస్య వచ్చిందంటున్నారు.

‘మా బావ ప్రభాస్‌నా?? ఇదెప్పుడు జరిగిందని ఒకడంటే.. బావా అన్నందుకు గొల్లున నవ్వుతున్న వీడియోలను షేర్ చేస్తున్నారు ట్రోలర్స్. అయితే అసలు విషయం ఏంటంటే.. ‘బుజ్జిగాడు’ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్‌లు బావా బామ్మర్దులుగా చేశారు. ఆ చనువుతోనే మోహన్ బాబు.. ప్రభాస్‌ని బావా అని అనుండొచ్చు. అయితే ప్రభాస్‌ని మోహన్ బాబు బావా అని పిలవడంతో.. ట్రోలర్స్ తెగ హర్ట్ అయిపోతున్నారు. ‘నీకు ప్రభాస్ బావా ఏంట్రా అంటూ ఏకవచనం మోహన్ బాబుని బూతులు తిడుతూ వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు కొంతమంది ట్రోలర్స్. ఇక మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీ ‘కన్నప్ప’లో ప్రభాస్ కీలకపాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ లుక్ బయటకు వచ్చింది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత మంచు ఫ్యామిలీ ని ఏ రేంజ్ లో ఆడేసుకుంటారో చూడాలి.

ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం… మహాద్భుతం…!
మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు.
తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను.#Kalki2898AD #Prabhas @SrBachchan @nagashwin7…— Mohan Babu M (@themohanbabu) June 29, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read