మాస్ మహారాజా రవితేజ – హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన మూవీ మిస్టర్ బచ్చన్. ఆగస్టు 15 న ఈ మూవీ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా విడుదలైన సాంగ్, ట్రైలర్ సినిమా ఫై ఆసక్తి పెంచాయి. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
కాగా ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ముందు అనుకొన్న బడ్జెట్ (పారితోషికాలతో సహా) రూ.70 కోట్లు. అది చివరికి రూ.90 కోట్లు అయ్యింది. రవితేజ – హరీష్ సినిమా కాబట్టి బయ్యర్లు కాస్త ఉత్సాహంగానే ఉన్నారు. రూ.20 కోట్లకు ఓటీటీ అమ్ముడుపోయింది. రూ.26 కోట్లు హిందీ డబ్బింగ్ రూపంలో వచ్చాయి. అంటే అక్కడికి రూ.46 కోట్లు తేలాయి. థియేట్రికల్ రూపంలో అటూ ఇటుగా రూ.30 కోట్లు రావొచ్చు. శాటిలైట్ రూపంలో మరో నాలుగు కోట్లు రావొచ్చు. నైజాం నుంచి నిర్మాతలు రూ.15 కోట్లు ఆశిస్తున్నారు. కానీ బేరం మాత్రం రూ.12 దగ్గర ఆగిపోయింది. ఓవర్సీస్ ఎలాగూ నిర్మాతలే సొంతంగా విడుదల చేసుకొంటారు. ఎటు చూసినా ఈ లెక్కలు రూ.80 కోట్ల దగ్గర ఆగుతున్నాయి. అంటే ఇంకా రూ.10 కోట్లు లాస్ తోనే ఉంది. నిజానికి ఈ సినిమాని ముందే అనుకొన్నట్టు రూ.70 కోట్లలో పూర్తి చేసి ఉంటే, రూ.10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో సినిమా విడుదల అయ్యేది. ఇప్పుడు రూ.10 కోట్ల వెలితి కనిపిస్తోంది. సినిమా విడుదలై, మంచి విజయాన్ని అందుకొని, ఓవర్ ఫ్లోలు కనిపిస్తే తప్ప, ఈ లోటు పూడదు. మరి బచ్చన్ ఏంచేస్తుందో చూడాలి.