మెగాస్టార్ చిరంజీవి కి ఐఫా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు దక్కబోతున్నట్లు తెలుస్తుంది. 2023 వచ్చిన ఉత్తమ చిత్రాలకు గాను 2024 లో ఐఫా అవార్డుల పేరిట పురస్కారాలు అందజేయబోతున్నారు. ఇక ఈ ఏడాది అత్యధికంగా దసరా, బలగం లాంటి చిత్రాలు ఎక్కువ నామినేషన్లలో నిలవగా, IIFA ఉత్సవం శుక్రవారం, 6 సెప్టెంబర్ & శనివారం, 7 సెప్టెంబర్ 2024న జరగనుండగా, మొదటి రోజు తమిళం, మలయాళ భాషల సినిమాల విజేతలకు అవార్డులు, రెండో రోజు తెలుగు, కన్నడ భాషల విజేతలకు అవార్డులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా ఈ వేడుకలో ప్రతి సంవత్సరం లైఫ్ టైం అచీవ్ మెంట్, లేదా ఇతర గౌరవమైన పేర్ల మీద పలువురు లెజెండరి నటులకు. లేదా దర్శకనిర్మాతలకు, టెక్నిషియన్స్ కి గౌరవ పురస్కారం అందచేస్తుంటారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఆ పురస్కారం లభించనున్నట్లు తెలుస్తుంది.
రీసెంట్ గా భారత ప్రభుత్వం నుండి ‘పద్మ విభూషణ్’ అవార్డు పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఎంతో అభివృద్ధి చేసిన లెజెండరి నటుల్లో ఆయన కూడా ఒకరు. ఈ క్రమంలో
ఈ ఇయర్ జరగబోతున్న IIFA ఉత్సవం 2024 కి గానూ, “ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా” పేరిట గౌరవాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. ఈ వార్త బయటకు వచ్చిన దగ్గరి నుండి మెగాభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ వేడుక జరుగనున్నట్టు సమాచారం.