Movie News

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, చ‌క్క‌టి ప్ర‌వ‌ర్త‌న కూడా ఉండాలి – చిరంజీవి

ఆప్త (అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) బిజినెస్ కాన్ఫరెన్స్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈవేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. సూపూ కోటాన్, సాగ‌ర్ ల‌గ్గిశెట్టి, ర‌మేష్ తూము, మ‌ధు వ‌ల్లి, చంద్ర న‌ల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమ‌ట‌, విగ‌య్ గుడిసేవ‌, బాబీ అడ్డా, చలమశెట్టి అనీల్ (గోపి) తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “ఆప్త వారి ఆధ్వ‌ర్యంలో ఎంతో మందికి యువ‌ ఎంట‌ర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించే విధంగా ఈవెంట్ జరిగింది. నాకు ఇక్క‌డ ఉన్న వారందరూ నా ఆప్తులుగా, కుటుంబ స‌భ్యులుగా అనిపిస్తున్నారు. నా ప్ర‌యాణంలో ప‌రిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ఎదిగాను. ఎంటర్‌ప్రెన్యూర‌షిప్‌కు పాజిటివ్ థింకింగ్, ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చడం, క‌ష్ట‌ప‌డటం ముఖ్య‌మ‌ని నేర్చుకున్నాను. నా ప్ర‌యాణంలో నేను నేర్చుకున్న ఫిలాస‌ఫీతో ముందుకు వెళ్ళాను. నా అభిమానం ఉన్నవారు, నా కుటుంబ సభ్యులు, అభిమానుల స‌హ‌కారంతో నేను ఎదిగాను.”

చిరంజీవి తన జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకులు, అనుభ‌వాల గురించి వివరించారు. “నా అనుభ‌వాల నుంచి నేర్చుకున్న పాఠాలే నాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయ‌” అని అన్నారు.