Movie News

డైరెక్టర్ శంకర్ ఫై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ ఫై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం తో ఊగిపోతున్నారు. RRR తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్..గేమ్ చేంజర్ తో మరో హిట్ కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నప్పటికీ..డైరెక్టర్ శంకర్ మాత్రం సినిమాను ఇంకా వెనక్కి తీసుకెళుతుండడం ఫై ఆగ్రహంగా ఉన్నారు.

ఇండియన్ 2 సినిమా షూటింగ్‌తో గేమ్ చేంజర్ ఆలస్యం కావాల్సి వచ్చింది. మధ్యలో శంకర్ కొన్ని రోజులు నెలలో సగం రోజులు అటు, సగం రోజులు ఇటు అన్నట్టుగా రెండు పడవలపై ప్రయాణం చేశాడు. కానీ గేమ్ చేంజర్‌ను వెనక్కి నెట్టి ఇండియన్ 2ని ముందుకి తీసుకొచ్చాడు. ఇండియన్ 2 విడుదలకు సిద్దంగా ఉంది. ట్రైలర్ అయితే శంకర్ స్థాయిలోనే ఉంది. ఎంతో గ్రాండియర్‌గా, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా, యువతను మేల్కోపేలానే ఉంది. భారతీయుడు 2 అంటూ కమల్ హాసన్ ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. అయితే శంకర్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గేమ్ చేంజర్ గురించి చెప్పుకొచ్చాడు.

గేమ్ చేంజర్ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, ఇంకో పది పదిహేను రోజులే మిగిలి ఉందని అన్నాడు. ఇక ఇదే మాట ఎన్ని నెలల నుంచి చెబుతారు అంటూ శంకర్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ లాంటి యంగ్ జనరేషన్‌తో పని చేస్తుండటం ఎలా ఉందని అడిగితే.. ప్రభు దేవా తరం పేరు తీయడం, రామ్ చరణ్ గురించి అడిగినప్పుడు ఎంత నీరసంగా సమాధానం ఇచ్చాడో అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.