సినిమా వార్తలు

నవంబర్ 4న గ్రాండ్‌గా బ్లాక్ బస్టర్ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ రీ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2004లో వచ్చిన ఈ చిత్రం అప్పటి రికార్డులను బ్రేక్ చేసింది. శంకర్ దాదాగా చిరంజీవి నటించిన తీరు, చెప్పిన ఇంగ్లీష్ సామెతలు, వేసిన స్టెప్పులు అన్నీ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. మెగా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినిమా ప్రేమికులు సైతం శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు ముగ్దులయ్యారు.

అసలే ఇప్పుడు నాటి కల్ట్ క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఎక్కువగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సర్వం సిద్దమైంది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
మెగా ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం నవంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పెద్ద అసెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్లో పాటలు వస్తే.. లైవ్ కాన్సర్ట్‌లా మారిపోతాయని చెప్పాల్సిన పని లేదు. మరోసారి అప్పటి వింటేజ్ చిరుని చూపించేందుకు, ఆ గ్రేస్, మాస్‌ ఎరాలోకి తీసుకెళ్లేందుకు శంకర్ దాదా వస్తున్నాడని సోషల్ మీడియాలో సినీ లవర్స్ ట్వీట్లు, కామెంట్లతో సందడి చేస్తున్నారు.