Thursday, July 25, 2024
HomeMovie Newsసోషల్ మీడియా టాప్ ట్రెండ్ లో పవన్ - చిరు ఎమోషనల్ వీడియో

సోషల్ మీడియా టాప్ ట్రెండ్ లో పవన్ – చిరు ఎమోషనల్ వీడియో

- Advertisement -

ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడమే కాక జనసేన తరపున నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు గెలిచారు. దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పదేళ్లుగా కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ..ఇప్పుడు భారీ విజయం సాధించడం తో చిత్రసీమలోను ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. అన్నివైపులా నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల్లో గెలిచాక మొదటిసారి పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ మొత్తం గ్రాండ్ గా వెల్ కం చెప్పింది. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో టాప్ ట్రెండ్ లో కొనసాగుతుంది.

ఈ వీడియోలో చిరంజీవి – పవన్ కళ్యాణ్ ల ప్రేమ చూసి మెగా అభిమానులు ఆనందం తో కన్నీరు పెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లగా మెగా ఫ్యామిలీ అంతా పూలు జల్లి స్వాగతం తెలిపారు. పవన్ చిరంజీవి కాళ్లకు నమస్కరించాడు. చిరంజీవి పవన్ ని హత్తుకున్నాడు. చిరంజీవి పవన్ కు పెద్ద గజమాల వేసి పూల గుచ్చం ఇచ్చి స్వాగతం తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనమ్మ, తన వదిన సురేఖలకు కూడా పాదభివందనం చేశాడు.మెగా ఫ్యామిలీ అంతా కేక్ కట్ చేస్తుంటే వెనకాల సాయి ధరమ్ తేజ్ విజిల్స్ వేస్తూ సందడి చేశాడు. కంటిన్యూగా తేజ్ విజిల్స్ వేస్తూనే ఉన్నాడు. పవన్ తనయుడు అకిరాతో కూడా కలిసి అల్లరి చేసాడు. ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

An emotionally charged welcome to my dear brother A Real life ‘Power Star’!!

A Hero’s Homecoming ! 💐

God bless!! 🙏 @PawanKalyan pic.twitter.com/B9zgQPQyP5— Chiranjeevi Konidela (@KChiruTweets) June 6, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read