Movie News

మజాకా కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి బిగ్ థాంక్స్ – సందీప్ కిషన్

థాంక్స్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..  అందరికీ థాంక్యు. ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాకి అందరూ చాలా ప్రేమతో పని చేశారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి అందరికీ థాంక్స్. ముందుగా ప్రసన్న గారికి థాంక్స్ చెప్పాలి. నేను త్రినాథ్ గారు కలిసి పని చేయాలని కోరిక ప్రసన్న గారికే ఎక్కువుంది. చాలా సంవత్సరాలుగా అనుకున్నాం. ఫైనల్ గా మజాకాతో కుదిరింది. నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. పిల్లలు, పెద్దలు థియేటర్ కి వెళ్లి పగలబడి నవ్వుకోవాలని ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. నేను ఈ సినిమాని థియేటర్స్ లో చూశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చివర్లో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.

డైరెక్టర్  త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ..  ఆడియన్స్ థియేటర్స్ లో సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి  బాగా కనెక్ట్ అయింది. మేము ఏదైతే నవ్వించాలని చేశాము అది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుట్ అయింది. లాస్ట్ 15 మినిట్స్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. నవ్వొచ్చినప్పుడు నవ్వాలి ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి అప్పుడు హెల్త్ చాలా బాగుంటుంది. ఈ రెండు మా సినిమాలో ఉన్నాయి.అంతవరకు సక్సెస్ అయ్యానని ఫీల్ అవుతున్నాను. మజాకా చూసిన ఆడియన్స్ ఇంటికి వెళ్లి సినిమా గురించి చెప్పండి .ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది.

హీరోయిన్ రీతు వర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి బిగ్ థ్యాంక్స్. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.  టీమ్ లో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది’అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.  ఈ సినిమా ఆడియన్స్ థియేటర్స్ లో చాలా నవ్వుతున్నారు. మేము అనుకున్నట్టు ఈ సినిమా నవ్వుల కోసమే లాజిక్స్ కోసం కాదు. థియేటర్స్ లో జనంతో కలిసి చూస్తే నవ్వులు పదింతలు అవుతాయి. దీంతో ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది. మా మజాకాలో అలాంటి నవ్వులు పుష్కలంగా ఉన్నాయి. సినిమా ఇలాగే కంటిన్యూ అవ్వాలని వీకెండ్ కి మరింత పెరగాలని కోరుకుంటున్నాను. సందీప్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు లాస్ట్ వన్ మంత్ అసలు నిద్రపోలేదు. తన లైనఫ్ అద్భుతంగా ఉంది.