Monday, February 24, 2025
HomeMovie News‘మజాకా’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే  ఫన్ రైడ్ లాంటి సినిమా - సందీప్...

‘మజాకా’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే  ఫన్ రైడ్ లాంటి సినిమా – సందీప్ కిషన్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

రావు రమేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-చాలా బాగా అనిపించింది. మా కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఆయన చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా నటుడిగా ఆయకి ఇంకా రెస్పెక్ట్ ని తీసుకొస్తుందని నమ్ముతున్నాను.

ఇందులో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ?
-నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను నాన్న ఒకే ఇంట్లో బ్యాచిలర్స్ గా బ్రతుకుతుంటాం. మమల్ని ఎవరూ పండగలకి పబ్బాలకి పిలవరు. కలిసి తాగిపోడిపోయే తండ్రి కొడుకులంగా కనిపిస్తాం.

ఫాదర్ సన్ ఎమోషన్ వున్న సినిమా చేయడనికి కారణం ?
-నా గత నాలుగు సినిమాలు సీరియస్ టోన్ లో వుంటాయి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలనే మజాకా చేశాను. దీనికి త్రినాధ్ రావు, ప్రసన్న కలసి రావడం లక్కీగా కుదిరింది. ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్ ఈ సినిమాలో వుంది. ఇది ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. అందరూ కలసి చూడదగ్గ సినిమా చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది.  

30వ మైల్ స్టోన్ చేరుకోవడం ఎలా అనిపిస్తోంది ?
-15 ఏళ్లలో ముఫ్ఫై సినిమాలు. ఇది వెరీ ఇంట్రస్టింగ్ ఎడ్వంచరస్ జర్నీ. నేను ప్రేమించిన వృత్తికి పూర్తి అంకిత భావంతో నా కుటుంబం కంటే సినిమాకి ఎక్కువ ప్రాధాన్య ఇస్తూ ముందుకు వెళుతున్నాను.

అన్షు గారిని తీసుకోవాలనే ఛాయిస్ ఎవరిది ?
-డైరెక్టర్, ప్రసన్న గారిది. నేను సంగీత గారు లాంటి యాక్టర్ అనుకున్నాను. అయితే డైరెక్టర్, ప్రసన్న మంచి ఆలోచన చెప్పారు. అసలు అన్షు లాంటి అమ్మాయిని రావు రమేష్ గారు ఎలా ప్రేమిస్తారు ? అక్కడే ఇందులో కామెడీ పండుతుందని చెప్పారు. అదే అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది.  

రీతు వర్మ గురించి ?
-రీతు ఈ సినిమాకి ఒక ఫ్రెష్ నెస్ యాడ్ చేసింది. తనకి ఇలాంటి సినిమాలు కొత్త. మా క్యారెక్టర్స్ చాలా బ్యూటీఫుల్ గా వచ్చాయి.

త్రినాథ్ రావు నక్కిన గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-త్రినాథ్ రావు గారు నాకు ఎప్పటినుంచో ఇష్టం. ఆయన ఫస్ట్ సినిమా మేము వయసుకు వచ్చాం బ్యుటీఫుల్ ఫిల్మ్. అప్పటి నుంచి ఆయన నాకు ఇష్టం.
నిర్మాతల గురించి ?
-రాజేష్, అనిల్ గారు అంటే నాకు హోం ప్రొడక్షన్. ఒకరు అన్నయ్య, మరొకరు ఫ్రెండ్ లా వుంటారు. చాలా పాజిటివ్ గా కలసి పని చేస్తాం.   

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read