కొత్త హీరో అభయ్ హీరోగా, మేఘా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతూ పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్రలో నటించి విడుదలైన లేటెస్ట్ సినిమా “మార్షల్”. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జయరాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సినిమా సక్సెస్ అవడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సంధర్భంగా దర్శకుడు జయరాజ్ సింగ్ మాట్లాడుతూ..
విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మార్షల్’ సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మార్షల్’ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకొంటుందని శ్రీకాంత్ అన్న ఇంత మంచి క్యారెక్టర్ చేయడం వల్లే సినిమా హిట్ అయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కొత్త హీరో అభయ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని జయరాజ్ సింగ్ అన్నారు. తన సినిమాని ఆదరించినందకు హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు.
హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ..
సినిమా విడుదలైన తర్వాత ప్రతీ ఒక్కరి నుంచి వస్తున్న అభినందనలు వింటుంటే చాలా సంతోషంగా ఉందని, సినిమాని ప్రతీ ఒక్కరూ చూసి బాగా చేశానని అంటున్నారని, ఇంకా చూడనివాళ్లు ఉంటే తప్పకుండా వెళ్లి సినిమా చూడాలని ఆమె అన్నారు.
హీరో అభయ్ మాట్లాడుతూ..
సినిమా సక్సెస్ అవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు థ్యాంక్స్ చెప్పిన అభయ్.. ఫస్ట్ రోజు చాలా డల్ గా ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయని, కానీ రెండోరోజు నుంచి మౌత్ టాక్ తో ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారని అన్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ ఇచ్చిన క్రిటిక్స్ అందరికీ పేరపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మౌత్ టాక్ తో పాటు ప్రేక్షకులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అందుకు కారణం శ్రీకాంత్ అని.. హీరోగా ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నానని అన్నారు. నిర్మాతగా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. మౌత్ టాక్ చాలా బాగుందని, ప్రతీ ఒక్కరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని, వాట్సప్.. ఫేస్బుక్.. సోషల్ మీడియాలో తనకు అభినందనలు విపరీతంగా వస్తున్నట్లు చెప్పారు. కొత్త వాళ్లం అయిన మాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. నేను, మా డైరెక్టర్.. మా టీమ్.. అందరం చాలా హ్యాపీగా ఉన్నామని.. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుతున్నాం అని అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..
సినిమా సక్సెస్ అవడంతో చాలా సంతోషంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ సినిమా చూసి ఫోన్ చేసి చెబుతున్నారని, డైరెక్టర్ గురించి అడుగుతున్నారని, ఈ మధ్య కాలంలో నా సినిమాల్లో ఇది ఒక మంచి సినిమాగా నిలిచిపోయిందని అన్నారు. క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చిందని అన్నారు. సినిమాకు అవార్డులు కూడా వస్తాయని అంటున్నారని, అందులో డైరెక్టర్ కష్టం చాలా ఉందని అన్నారు. జయరాజ్ కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారని అన్నారు. మహాత్మ, ఖడ్గం సినిమాల తర్వాత అంత వైవిద్యమైన క్యారెక్టర్ ఇదేనని కొత్త హీరో అయినా కూడా అభయ్ చాలా బాగా చేశాడని, ప్రొడ్యూసర్ గా కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడని అన్నారు. ఒక్కసారి సినిమా చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండి అని శ్రీకాంత్ అన్నారు. కలెక్షన్లు పికప్ అయ్యాయని, మేఘా చౌదరి సినిమాలో చాలా బాగుంది. బాగా చేసింది అని శ్రీకాంత్ అన్నారు.
నటీనటులు
అభయ్ ,
శ్రీకాంత్,
మేఘా చౌదరి,
రష్మి సమాంగ్,
సుమన్,
వినోద్ కుమార్,
శ రణ్య,
పృద్విరాజ్,
రవి ప్రకాష్,
ప్రియ దర్శిని రామ్,
ప్రగతి,
కల్ప వల్లి,
సుదర్శన్, తదితరులు నటించిన
ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : కె.జీ.ఎఫ్ ఫేమ్ రవి బసురి
ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్,
మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,
ఫైట్స్ : నాభ మరియు సుబ్బు
ఎడిటర్ : చోట కె ప్రసాద్,
పాటలు : యాదగిరి వరికుప్పల,
కళా దర్శకుడు : రఘు కులకర్ణి,
డాన్స్ మాస్టర్ : గణేష్
ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ
నిర్మాత : అభయ్ అడకా