Tuesday, December 24, 2024
HomeMovie Newsపవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అనవసరం - కృష్ణ కూతురు

పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అనవసరం – కృష్ణ కూతురు

- Advertisement -

జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంత రాజకీయాలపైనే పెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా జనసేన పార్టీని విజయంలోకి తీసుకరావాలని, తాను ఎమ్మెల్యే గా గెలిచి తీరాలని కసరత్తులు చేస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా తన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ విజయం సాధించడం ఖాయమని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటె రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ..ప్రచారంలో కృష్ణ గారిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. ఈ తరుణంలో కృష్ణ కూతురు మంజుల గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల ఫై చేసిన వ్యాఖ్యలను కొంతమంది వైరల్ చేస్తున్నారు.

‘‘పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ అసలు సాటిలేని హీరోలు అయిపోయారు. అందుకే ఇప్పుడు వెళ్లి ప్రజా సేవ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన సింపుల్‌గా సినిమాలు ఎంజాయ్ చేయవచ్చు. కెరీర్ అంత పీక్‌లో ఉన్నప్పుడు ఎవరు ఇలా చేస్తారు? ఎన్‌టీఆర్, ఎమ్‌జీఆర్ లాంటి వారు కొన్నేళ్ల తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ చేసింది మాత్రం సాధారణమైనది కాదు. ఎందుకంటే ప్రజాసేవ అనేది ఆయన మనసు నుండి వస్తుందని, స్వచ్ఛమైనదని స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి లీడర్లు చాలా అవసరం. అది స్వార్థం నుండి పుట్టింది కాదు. నాకు పవన్ కళ్యాణ్‌తో వ్యక్తిగత పరిచయం ఏం లేదు. కానీ నేను చూస్తున్నంత వరకు ఆయనకు రాజకీయంలోకి రావాలనే ఇంట్రెస్ట్ మనసు నుండి వచ్చిందని కనిపిస్తుంది. మనసు చెప్పింది వినేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. అందులో ఆయన ఒకరు’’ అంటూ పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికి ఎత్తారు. దీనికి సంబదించిన వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read