మంచు విష్ణు కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేసి, హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి వినూత్న ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టారు. తాజాగా “తరంగ వెంచర్స్” పేరుతో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించిన ఆయన, 50 మిలియన్ డాలర్ల నిధులతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా చేరనున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండబోతుందని ఆయన తెలిపారు.
తరంగ వెంచర్స్ వినోదరంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడేలా పనిచేయనుంది. ప్రత్యేకంగా ఓటీటీ వేదికలు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్ వంటి సాంకేతికతలకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సరికొత్త టెక్నాలజీలు ఏఆర్, వీఆర్, ఏఐ వంటి అత్యాధునిక సేవలను అందించనుంది. దీని ద్వారా వినోద రంగానికి కొత్త ప్రాణం పోసే అవకాశాలపై ఆసక్తి కనబరుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు, విల్ స్మిత్‌తో పాటు ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, దేవేష్ చావ్లా, సతీష్ కటారియా వంటి ప్రతిభావంతులైన వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరికొందరు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యంతో, తరంగ వెంచర్స్ విప్లవాత్మక మార్పులకు ముందుకు సాగనుంది.
ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న “కన్నప్ప” సినిమా ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఈ సినిమాను ముఖేశ్ కుమార్ సింగ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్ వంటి నటులతో పాటు ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 25, 2025న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది.