మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం ఆస్తుల వివాదం భగ్గుమంటోంది. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య నెలకొన్న గొడవలు రాజీ దిశగా సాగడం లేదు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ముంబై నుంచి మంచు లక్ష్మి హైదరాబాద్‌కు వచ్చి ప్రయత్నించినప్పటికీ, ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంచు లక్ష్మి రాజీ కుదర్చలేక ముంబైకి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు రంగంలోకి దిగుతున్నా సమస్య ఇంకా పరిష్కార దశకు రాలేదు. ఈ వివాదం సెటిల్ చేసేందుకు మంచు ఫ్యామిలీ సన్నిహితుడు శ్రీశైలం యాదవ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. శ్రీశైలం యాదవ్ గతంలో మంచు ఫ్యామిలీకి దగ్గరగా ఉండడం, ప్రత్యేకంగా మనోజ్ కూతురు పెళ్లిలో పాల్గొనడం అందరికీ తెలిసిందే.
ఇటీవల మంచు విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్, మనోజ్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లడం ఈ వివాదానికి మరింత రగదీశింది. మనోజ్ ఇంటి వద్ద విష్ణు బౌన్సర్లు కాపలా కాస్తున్న సంగతి కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గత కొంత కాలంగా ఆస్తుల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఒక గొడవలో మోహన్ బాబు తనకు మద్దతుగా ఉన్న మనోజ్ భార్యపై చేయి చేసుకున్నారని మనోజ్ ఆరోపించారు. ఈ విషయంపై ఇద్దరూ పోలీస్ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదం ఇప్పుడు మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో, సమస్యకు పరిష్కారం కుదురుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అందరూ ఈ గొడవ తక్షణమే ముగియాలని ఆశిస్తున్నారు.