గత కొద్దీ రోజులుగా థియేటర్స్ అన్ని బోసిపోయాయి. సరైన సినిమాలు లేక..పెద్ద హీరోలు సినిమాలు వాయిదా పడడంతో సమ్మర్ ఏమాత్రం సందడి లేకపోయింది. సమ్మర్ లో పెద్ద సినిమాలు వస్తాయని అంత ఎంజాయ్ చేయొచ్చని సినీ లవర్స్ భావించినప్పటికీ ఎన్నికల హడావిడి , IPL ఎఫెక్ట్ తో సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో పది రోజుల పాటు సింగిల్ థియేటర్స్ సైతం మూతపడ్డాయి. గత వారం నుండే మళ్లీ సినిమాల సందడి మొదలైంది. దీంతో మళ్లీ థియేటర్స్ వద్ద సందడి మొదలైంది.
ఈ క్రమంలో ఈరోజు శర్వానంద్ నటించిన మనమే మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం విశేషం. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో సినిమా షోస్ పూర్తి కావడం తో సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా లో అభిమానులు షేర్ చేస్తున్నారు.
సినిమా కు మిశ్రమ టాక్ వస్తుంది. సినిమా చాలా బోరింగ్‌గా ఉందని, ఎమోషన్స్, కామెడీతో పాటు లవ్‌స్టోరీ సరిగ్గా వర్కవుట్ కాలేదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ టెంప్లేట్ ఫ్యామిలీ మూవీగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మనమే సినిమాను తెరకెక్కించాడని అంటున్నారు. శర్వానంద్ ఎనర్జీ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని నిలబెట్టిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్లతో పాటు ఓ చిన్నారి…కేవలం ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టే కథ మొత్తం తిరుగుతుందని అంటున్నారు. కీలకమైన సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు పూర్తిగా పట్టుతప్పాడని, క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్టివిటీని సరిగ్గా బిల్డ్ చేయలేకపోయాడని ట్వీట్స్ చేస్తున్నారు. శర్వానంద్ యాక్టింగ్ ఫుల్ మార్క్స్ అందుకోగా… డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు ఆడియన్స్ నుంచి నెగెటివ్ మార్క్స్ వస్తున్నాయి. క్వాలిటీ మేకింగ్, బ్యూటిఫుల్ లొకేషన్స్‌తో మనమే మెస్మరైజ్ చేస్తుందని, అయితే కథ విషయంలో మాత్రం డిసపాయింట్ అవుతారని చెబుతోన్నారు. మనమే మూవీలో గత సినిమాలకు మించి స్టైలిష్‌గా శర్వానంద్ కనిపించాడని, కృతిశెట్టితో అతడి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుటుందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. తన క్యారెక్టర్‌కు శర్వానంద్ వందశాతం న్యాయం చేశాడని చెబుతోన్నారు.