గత కొద్దీ రోజులుగా థియేటర్స్ అన్ని బోసిపోయాయి. సరైన సినిమాలు లేక..పెద్ద హీరోలు సినిమాలు వాయిదా పడడంతో సమ్మర్ ఏమాత్రం సందడి లేకపోయింది. సమ్మర్ లో పెద్ద సినిమాలు వస్తాయని అంత ఎంజాయ్ చేయొచ్చని సినీ లవర్స్ భావించినప్పటికీ ఎన్నికల హడావిడి , IPL ఎఫెక్ట్ తో సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో పది రోజుల పాటు సింగిల్ థియేటర్స్ సైతం మూతపడ్డాయి. గత వారం నుండే మళ్లీ సినిమాల సందడి మొదలైంది. దీంతో మళ్లీ థియేటర్స్ వద్ద సందడి మొదలైంది.
ఈ క్రమంలో శర్వానంద్ నటించిన మనమే మూవీ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం విశేషం. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కి అన్ని చోట్ల మిశ్రమ టాక్ రాబట్టింది. అయినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్లు పర్వాలేదు అనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1 కోటి షేర్ మాత్రమే వసూలు చేయగా.. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని ఈ సినిమా రూ. 1.60 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ చేసిన బిజినెస్ చూస్తే..నైజాంలో రూ. 3.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.50 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ జరిగింది. బిజినెస్ తగ్గట్లు రాబడుతుందా అంటే కష్టమే అని చెప్పాలి.