Movie News

బిగ్ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిన పేరు మమితా బైజు. అసలు తెలుగులో నేరుగా ఒక్క సినిమా చేయకపోయినా తెలుగు అడియన్స్ మనసు దొచుకుంది. అందం.. అంతకుమించిన చలాకీతనం.. తనదైన నటనతో కుర్రకారు ఫేవరేట్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. ఇటీవల మలయాళం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా.. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రేమలు మూవీలో అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామకు..ప్రస్తుతం వరుస ఆఫర్లు తలుపుతడుతున్నాయి. తాజాగా తమిళంలో బిగ్ ఆఫర్ కొట్టేసింది. కీర్తిశ్వరన్‌ దర్శకత్వంలో ప్రదీప్‌ రంగనాథన్‌ తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది.

అలాగే తెలుగులో ఈ అమ్మడికి పలు ఛాన్సులు వస్తున్నాయని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం విజయ్‌ దేవరకొండ సరసన మమితా బైజు నటించనుందని వినికిడి. విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ పాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. కొద్ది మాసాల క్రితం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. తొలుత ఈ చిత్రంలో శ్రీలీలను కథానాయికగా తీసుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకున్నట్లు తెలిసింది. ఇప్పుడా స్థానంలో మమిత బైజుని కథానాయికగా ఖరారు చేయబోతున్నారని సమాచారం.