మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానులకు మెగా ట్రీట్ ఇవ్వబోతుంది వైజయంతి మూవీస్. ఆగస్టు 22 న చిరంజీవి బర్త్ డే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు బర్త్ డే అంటే ఊరు వాడ సంబరాలే. రక్తదానాలు , పండ్లు పంచడం, పేదవారికి బట్టలు అందించడం, కేక్స్ కట్ చేయడం ఇలా ఎన్నో చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. అలాగే అభిమానులకోసం మెగా స్టార్ నటిస్తున్న కొత్త చిత్రాల తాలూకా అప్డేట్స్ ఇచ్చి ఆనందం నింపుతారు. అలాంటిది ఈ బర్త్ డే కు మెగా ట్రీట్ ఇచ్చేందుకు వైజయంతి మూవీస్ సిద్ధమైంది.
ఇండస్ట్రీ హిట్స్ లో ఈ జెనరేషన్ కి కూడా గుర్తుండి పోయే సినిమా ‘ఇంద్ర’. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక పుస్తకం రాయొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. ఇంద్రసేనుడిగా మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన నటనకు తోడు దర్శకుడు బి.గోపాల్ మాస్ డైరెక్షన్, పరచూరి బ్రదర్స్ మాటలు ఇలా అన్నీ ఇంద్ర అఖండ విజయానికి తోడయ్యాయి. కాగా నేటికీ ఈ సినిమా విడుదలై 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇంద్ర సినిమా విడుదలైన తొలి ఆటకే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుని, ఏకంగా 33 కోట్ల షేర్ ని అప్పట్లోనే వసూలు చేసింది. బిజినెస్ కి ఏకంగా 14 కోట్లకి పైగా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బయ్యర్లకి భారీ లాభాలు అందించింది. ఈ రికార్డులు బ్రేక్ చేయడానికి స్టార్ హీరోలకు నాలుగేళ్లు పట్టింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న తొలి సినిమాగా ఇంద్ర నిలిచింది. లాంగ్ రన్ లో థియేటర్ల వద్ద జాతర సృష్టించిన ఇంద్ర సినిమా అప్పట్లోనే 229 సెంటర్స్ లో 50 రోజులు, 128 సెంటర్స్ లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఇక 32 సెంటర్స్ లో ఏకంగా 175 రోజులు ప్రదర్శింపబడి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. థియేటర్లలో ఈ లాంగ్ రన్ రికార్డుని కొన్ని సినిమాలు ఆ తర్వాత బ్రేక్ చేసినా, కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేయడానికి మాత్రం నాలుగేళ్ళ టైం పట్టింది.
ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఇంద్ర’ సినిమాని రీ రిలీజ్ చేయాలన్న నిర్ణయం తీసుకొంది వైజయంతీ మూవీస్. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈరోజుతో ఇంద్ర విడుదలై సరిగ్గా 22 ఏళ్లు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో, బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇంద్ర’ అప్పట్లో ఇండ్రస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసింది. వైజయంతీ మూవీస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న వైజయంతీ మూవీస్ రీ రిలీజ్‌ల పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ ట్రెండ్ లో తొలిసారి తమ సినిమాని మళ్లీ విడుదల చేయాలని సంకల్పించింది. పైగా వైజయంతీ మూవీస్ కు గోల్డెన్ జూబ్లీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఇంద్ర’ని రీ రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రకటన తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.