Movie News

‘కల్కి’ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన మహేష్ బాబు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా థియేటర్ల వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజు నుండి రికార్డులు కొల్లగొడుతూ మంచి థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తోంది. ప్రభాస్ సహా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి పాన్ ఇండియా భారీ తారాగణం ఈ సినిమాలో నటించడం వల్ల అన్ని భాషల్లో కూడా కల్కి కి భారీ ఓపెనింగ్స్ రావడం జరిగింది. ఇక కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు తెలుగు సినిమా చూస్తున్నామా..? హాలీవుడ్ సినిమా చూస్తున్నామా..? అనే రీతిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినీ స్టార్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ సైతం ఇలాగే రియాక్ట్ అయ్యారు. కల్కి చూసి నా మైండ్ బ్లాక్ అయింది.. జస్ట్ వావ్.. నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ విజన్‌కు హ్యాట్సాఫ్.. ప్రతీ ఫ్రేమ్ ఓ ఆర్ట్‌లానే ఉంది.. అమితాబ్ సర్ స్క్రీన్ ప్రజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.. కమల్ హాసన్ సర్ ప్రతీ కారెక్టర్‌ను ఎంతో యూనిక్‌గా పోషిస్తారు.. ప్రభాస్ ఖాతాలో మరో అద్భుత చిత్రం పడింది.. ఎంతో ఈజ్‌తో ప్రభాస్ నటించాడు.. దీపిక అద్భుతంగా నటించింది.. ఇంతటి భారీ విజయాన్ని దక్కించుకున్న వైజయంతీ మూవీస్‌కు కంగ్రాట్స్ అంటూ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

#Kalki2898AD… blew my mind away 🤯 🤯🤯Just wow!! @nagashwin7, hats off to your futuristic vision. Every frame is a piece of art 👏👏👏— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2024