Monday, December 23, 2024
HomeMovie Newsధనుష్ యాక్టింగ్ ఫై మహేష్ బాబు ప్రశంసలు

ధనుష్ యాక్టింగ్ ఫై మహేష్ బాబు ప్రశంసలు

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రాయన్. 3 మూవీ నుంచి ఇక్కడ ధనుష్‌కు మంచి క్రేజ్ ఏర్పడగా.. రఘువరన్ బీటెక్‌తో ధనుష్ తెలుగు హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి ధనుష్ సినిమాలను తెలుగు వారు ఆదరిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించిన రాయన్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కన్నప్పటికీ తమిళనాట ప్రేక్షకులు బ్రహ్మ రథంపడుతున్నారు. ముఖ్యంగా ధనుష్ యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ధనుష్ యాక్టింగ్ ఫై ప్రశంసలు కురిపించారు.

‘రాయన్’ లో ధనుష్ నటన, దర్శకత్వం అద్భుతం. ఎస్‌జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ లు అద‌ర‌గొట్టారు. చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రు వంద‌శాతం క‌ష్ట‌ప‌డ్డారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ ఆర్ రెహ‌మాన్ సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ప్ర‌తి ఒక్క‌రు చూడాల్సిన సినిమా. చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు అంటూ మ‌హేశ్ బాబు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సందీప్ కిష‌న్ స్పందిస్తూ.. కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.

ఇక మహేష్ విషయానికి వస్తే..రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు. ఇందుకోసం త‌న లుక్‌ను మార్చుకునే ప‌నిలో ఉన్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం ఉండ‌నుంద‌ని అంటున్నారు. ఇక ఈ సినిమా మూడు పార్టులుగా తీయాల‌ని ద‌ర్శ‌క దీరుడు రాజ‌మౌళి అనుకుంటున్న‌ట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానున్న‌ట్లు తెలుస్తోంది.

#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch…

Congratulations to the entire…— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read