Movie News

మహారాజ OTT రిలీజ్ డేట్..

తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమాగా మహారాజ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ సినిమాని నిర్మించారు. తెలుగులో మహారాజ సినిమా ఎన్‌విఆర్ సినిమా ద్వారా శుక్రవారం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా…ఈ చిత్ర ఓటిటి స్ట్రీమింగ్ కు సంబదించిన ఓ వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాలుగు వారాల తర్వాత లేదా ఆరు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతికి సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.